తమ మహిళా సభ్యులపై పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. “సబితా ఇంద్రారెడ్డి జుట్టు పట్టుకుని గొంతు పిసికే ప్రయత్నం చేశారు. ఆమెపై దాడికి బాధ్యుడు సీఎం రేవంత్రెడ్డే. కోవా లక్ష్మి లేకుంటే.. సునీతా లక్ష్మారెడ్డి ఇనుప కంచెలపై పడేవారు. శాసనసభ దుశ్శాసన పర్వంలా మారింది. డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్, డైవర్షన్ మాత్రమే రేవంతు తెలుసు. ఈ దాడిని కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేశారు” అని కేటీఆర్ విమర్శించారు.