తమిళనాడు శాసనసభలో ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో మహిళలను కించపరుస్తూ,డబుల్ మీనింగ్స్ ఉపయోగిస్తూ మాట్లాడితే చట్టం ఊరుకోదని, కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. నటి త్రిషను ఉద్దేశించి డిఎంకె నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల వివాదంపై అసెంబ్లీ వేదికగా సీఎం విజయ్ పరోక్షంగా స్పందిస్తూ ప్రతిపక్షాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.