రవీంద్రభారతిలో ప్రముఖ రైతు సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభలో సిఎం మాట్లాడుతూ వ్యవసాయం గురించి సాధికారంగా మాట్లాడగలిన వ్యక్తి మల్లారెడ్డి అని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. భూమిలోని సారం నుంచి మొదలు పెట్టి.. నీరు, విత్తనం, పెట్టుబడి, పంట,గిట్టుబాటు ధర..అన్ని అంశాలు కూలంకషంగా మల్లారెడ్డి చెప్పేవారని అన్నారు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఏకమై ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ పై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని, కమ్యూనిస్టుల సహకారంతో కాంగ్రెస్ చేసిన పోరాటాల వల్లే మోడీ నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నారని విమర్శించారు.