<span;>ఫ్లోరిడా మయామి అంతర్జాతీయ విమానాశ్రయంలో అమెజాన్ ప్రైమ్ ఎయిర్ కు చెందిన బోయింగ్ 767-300 రకానికి చెందిన విమానం ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పింది. రన్‌వేపై నుంచి పక్కకు దూసుకెళ్లింది. అక్కడ పార్క్ చేసి ఉన్న అనేక ఇతర వాహనాలను ఢీకొట్టింది.ఈ తాకిడితో ఫ్లైట్ ఫ్యూయల్ ట్యాంక్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఉవ్వెత్తున మంటలు ఎగిశాయి. ఘటనలో అయిదుమంది దుర్మరణం పాలయ్యారు.ఈ అగ్నిప్రమాదం కారణంగా విమానాశ్రయంలోని అన్ని రన్వేలలో కూడా విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.