భారత ప్రధాని నరేంద్ర మోదీ కోసం బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ ప్రత్యేకంగా ‘ఇండియా గేట్’ ఆకృతిలో ఉన్న చాక్లెట్ ను తయారు చేయించారు. అయితే అది మార్గమధ్యలోనే కరిగిపోయి పాడైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్ లో బెల్జియం దౌత్యకార్యాలయం తాము తయారు చేయించిన ‘ఇండియా గేట్ చాక్లెట్’ చిత్రాన్ని ఎక్స్ వేదికగా పంచుకుంది. భారత్ పర్యటన సందర్భంగా మోదీకి ఈ వినూత్న కానుకను అందించాలని వెవర్ భావించారు. అయితే భారత్ కు తీసుకొస్తుండగా కరిగిపోవడంతో అందించలేకపోయారు.