ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ అసిస్టెంట్ ఉరివేసుకొని ఆత్మహత్యకు చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగింది. నంగునూరు మండలం రాజగోపాల్ పేట గ్రామానికి చెందిన ఆకు బత్తిని పవన్ గత ఏడు సంవత్సరాలుగా సిద్దిపేట జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పని చేసతున్నారు. ఆదివారం ఉదయం ఆస్పత్రిలోని పవన్ ఉరేసుకున్నాడు. ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధికారుల వేధింపులా? లేక వ్యక్తిగత కారణాలా? అనే కోణం పోలీసులు విచారణ చేస్తున్నారు.