సాంకేతికత ఎంత పెరిగినా టీచర్ కు ప్రత్యామ్నాయం లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సమాజంలో గొప్ప వ్యక్తులంతా ఉపాధ్యాయుల చేతుల్లో ఎదిగిన వాళ్లేనని చెప్పారు. “1991 నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. టెక్నాలజీతో మంచి చెడు రెండూ ఉన్నాయి. నేటి కాలంలో బోధనా విధానం పూర్తిగా మారింది. టీచర్లు గమనించాలి. మారుతున్న సాంకేతికత పిల్లలలపై పెను ప్రభావం చూపిస్తోంది. సామాజిక మాధ్యమాలు పిల్లలకు శాపంగా మారాయి. పిల్లల్లో కుటుంబ విలువలు, నైతిక ప్రవర్తన పెంపుపై టీచర్లు దృష్టి పెట్టాలి.