ఏపీలో నిర్వహించిన DSC 2025 నియామకాల కుంభకోణంలో రోజు రోజుకు కొత్త విషయాలు బయటపడుతున్నాయని మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆరోపించారు. డీఎస్సీ అక్రమాలపై సోషల్ మీడియా , వివిధ ప్రసార మాధ్యమాలు విస్తృతంగా వాస్తవాలను ప్రచారం చేస్తుండగా వాటి అకౌంట్లను చంద్రబాబు బ్లాక్ చేయిస్తున్నారని ట్విటర్‌లో విమర్శించారు. చంద్రబాబు నాయుడు, మీరు దేనికి భయపడుతున్నారు? ప్రశ్నలకా లేక సమాధానాలకా? డీఎస్సీ నియామకాలలో ప్రతిరోజూ వెలుగులోకి వస్తున్న ఆధారాలు అబద్ధమైతే, ప్రజల ముందుకు వచ్చి వాస్తవాలతో వాటిని తప్పు అని నిరూపించాలని డిమాండ్ చేశారు.