శుక్రవారం రాత్రి 11:40 గంటల ప్రాంతంలో త్రిస్సూర్ జిల్లా కైపమంగలం సమీపంలోని పనంబిక్కున్ను వద్ద జాతీయ రహదారి 66పై తమిళనాడు రిజిస్ట్రేషన్ కలిగిన కారులో ఎనిమిది మంది యువకులు గురువాయూర్ నుంచి కొడుంగల్లూర్ వైపు ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో హైవేపై నిర్మాణ పనులు జరుగుతుండగా రోడ్డు పక్కన ఆపి ఉంచిన గూడ్స్ లారీని వారి కారు అత్యంత వేగంగా వచ్చి వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.దుర్ఘటనలో ఎనిమిది మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు.దిండిగల్ ప్రాంతానికి చెందిన పీఎస్ఎన్ఏ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులుగా ప్రాథమికంగా గుర్తించారు.