అకస్మాత్తుగా సుమారు 300 అడుగుల మేర ఎత్తులో మార్పు, దాదాపు నాలుగు సెకన్ల పాటు విమానంపై నియంత్రణ కోల్పోయిన ఫుకెట్ నుంచి ఢిల్లీకి వచ్చిన AI2379 విమానానికి పైలట్‌గా వ్యవహరించిన కమాండర్‌పై ఎయిర్ ఇండియా కఠిన చర్యలు తీసుకుంది. సైకోయాక్టివ్ (మానసిక ప్రభావం చూపే) పదార్థానికి సంబంధించిన నిర్ధారణ పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో పైలట్ ఉద్యోగాన్ని తక్షణమే రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా శుక్రవారం వెల్లడించింది. విమాన కమాండర్ నిర్ధారణ పరీక్షలోనూ సైకోయాక్టివ్ పదార్థం ఉన్నట్లు AAIB తన ప్రాథమిక నివేదికలో పేర్కొంది.