వరుసగా పండుగలు రాబోతున్న వేళ మహారాష్ట్రలోని నాగ్‌పూర్ పట్టణ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పట్టణ పరిధిలో డీజేలు, మోడిఫైడ్ సౌండ్ సిస్టమ్స్, బీమ్ లైట్స్, లేజర్ బీమ్‌లైట్స్, డీజే వాహనాలపై నిషేధం విధించారు. అయితే, నిబంధనలకు అనుగుణంగా నడిచే సౌండ్ సిస్టమ్స్.. అంటే టాప్, మిడ్, బేస్‌తో కూడిన మల్టీ స్పీకర్ సిస్టమ్స్, ప్లాస్మా సౌండ్ సిస్టమ్స్, ప్రెజరైజ్డ్ సౌండ్ సిస్టమ్స్ వంటి వాటికి ఈ నిషేధం వర్తించదని నాగ్‌పూర్ సిటీ పోలీస్ కమిషనర్ తెలిపారు.