తూర్పు గోదావరి జిల్లా రాజానగరం వైకాపా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పై నల్లజర్ల పోలీసు స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ నెల 2న దూబచర్లలో జరిగిన వై.ఎస్. రాజశేఖర్రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజును కించపరిచేలా జక్కంపూడి రాజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై దూబచర్లకు చెందిన తెదేపా నాయకుడు బోడిగడ్ల నాగరఘు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జక్కంపూడి రాజాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయబాబు తెలిపారు.