ఉపాధ్యాయ దినోత్సవం ( Teachers’ Day) భారతదేశంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం రోజు సెప్టెంబర్ 5న ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. మన జీవితంలో ఉన్నత స్థానం గురువుకు ఇస్తాం. మనల్ని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో ఒక గురువు కృషి వెలకట్టలేనిది. అటువంటి గొప్ప వ్యక్తులను స్మరించుకుంటూ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీన భారతదేశంలో టీచర్స్ డే జరుపుకుంటున్నాము.