తాజాగా నరసాపురం వెళ్లిన సీఎం చంద్రబాబు.. స్థానిక జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పనితీరుపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. ఒక ఎమ్మెల్యే పనితీరును ప్రజల సమక్షంలో బహిరంగంగా ప్రశ్నించడం చాలా మంచి ప్రజాస్వామ్య సంప్రదాయమే అయితే, ఇలాంటి మంచి సంప్రదాయాన్ని ముందుగా తన బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నియోజకవర్గంలో ప్రారంభించి ఉంటే మరింత సమంజసంగా ఉండేదని నా అభిప్రాయం అని ట్వీట్ చేశారు.