తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కొండా కుటుంబం పేరు హాట్‌టాపిక్‌గా మారింది. మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ సోషల్ మీడియాలో చేసిన తాజా పోస్ట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. “ఇక నిరీక్షణ ముగిసింది.. అతి త్వరలో నిర్ణయం ప్రకటిస్తా” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలతో తదుపరి అడుగు ఏంటి? అనే చర్చ మొదలైంది. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోనని, ఎమ్మెల్యేగా కొనసాగుతూ తన నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని స్పష్టం చేశారు.