భారత పర్యటనకు బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ విచ్చేసిన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. రక్షణ, హరిత ఇంధనం, సాంకేతికత, వాణిజ్య రంగాల్లో పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. రక్షణరంగంలో పరస్పర సహకారం కోసం ఇరుదేశాల మధ్య లెటర్ ఆఫ్ ఇండెంట్ కుదిరింది. రాబోయే ఐదేళ్లలో ఇరుదేశాల మధ్య వాణిజ్యాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా ‘ఇండియా-బెల్జియం ఇన్వెస్ట్మెంట్ ఫాస్ట్ ట్రాక్’ వ్యవస్థను ప్రారంభించారు. చారిత్రక వజ్రాల వ్యాపారంతో పాటు ఫార్మా, పోర్టులు, డిజిటల్ నెట్వర్క్ల రంగాల్లో పెట్టుబడులను వేగవంతం చేయనున్నారు.