వారణాసి ఢిల్లీకి వెళ్తున్న విమానాశ్రయం నుచిం ఐఎక్స్ 1253 విమానం 155 మంది ప్రయాణికులతో బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే . విమానం కార్గో హోల్డ్ పొగను గుర్తించే అలారం మోగడంత పైలట్ అప్రమత్తమైన ఏటీసీని సంప్రదించారు. విమానాన్ని ల్యాండ్ చేసేందుకు అనుమతి కోరారు. అనంతరం 8.52 గంటలకు లక్నో విమానాశ్రయంలో విమానం సురక్షితంగా దిగింది. ప్రయాణికులను కిందకు దించిన అనంతరం విమానంలో తనిఖీలు జరిపారు.