ప్రముఖ జాతీయ మేగజైన్ ‘ఇండియా టుడే’ దేశంలోని టాప్ కథానాయికల జాబితాను విడుదల చేస్తూ, రష్మిక మందన్నను భారత్‌లోనే నంబర్-1 హీరోయిన్‌గా ప్రకటించింది. ఆమెను ‘ది న్యూ నేషనల్ స్టార్’గా అభివర్ణిస్తూ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన బాలీవుడ్ భామలు దీపికా పదుకోన్, శ్రద్ధా కపూర్, అలియా భట్ మరియు దక్షినాది నటి సాయి పల్లవిలను సైతం వెనక్కి నెట్టి రష్మిక అపారమైన ప్రజాదరణను, మార్కెట్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది.