ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత వేగంగా విస్తరిస్తుండటం, అంతర్జాతీయంగా ఆర్థిక సవాళ్లు పెరుగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గడిచిన ఎనిమిది నెలల స్వల్ప వ్యవధిలోనే AI సాంకేతికత ప్రభావం మరియు పునర్వ్యవస్థీకరణ కారణాల వల్ల సుమారు 1,23,300 మందికి పైగా ఉద్యోగులు పింక్ స్లిప్లు అందుకున్నారు. గతేడాది (2025) మొత్తంలో 1,22,606 మంది కొలువులు కోల్పోగా, ఈ ఏడాది కేవలం 8 నెలల్లోనే ఆ సంఖ్యను దాటిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.