వారానికి ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని వెంటనే అమలు చేయడంతో పాటు, తమ డిమాండ్ల సాధన కోసం బ్యాంక్ యూనియన్స్ దేశవ్యాప్త సమ్మె కార్యాచరణను ప్రకటించింది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 11వ తేదీన ఒకరోజు సమ్మె నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. సెప్టెంబర్ 11 (శుక్రవారం) సమ్మె తర్వాత.. సెప్టెంబర్ 12 (రెండో శనివారం), సెప్టెంబర్ 13 (ఆదివారం) సెలవులు కావడంతో వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. దీనివల్ల నిధుల బదిలీలు, ఏటీఎంలలో నగదు లభ్యతపై తీవ్ర ప్రభావం పడే చాన్స్ ఉంది.

