తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో నగరంలోని పలుచోట్ల పోస్టర్ల కలకలం రేగింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తెలంగాణ బీజేపీ హైదరాబాద్ వ్యాప్తంగా రాత్రికి రాత్రే భారీ ఎత్తున పోస్టర్లను ఏర్పాటు చేసింది. టీపీసీసీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ పరిసరాలు, ముఖ్యమంత్రి అధికారిక నివాసంతో పాటు రవీంద్ర భారతి, లక్ష్మీకాపుల్ బస్ స్టాండ్ వంటి రద్దీ ప్రదేశాలలో ఈ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి.