ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకల్లో అపశ్రుతి నెలకొంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని బెండమూర్లంకకు చెందిన రోళ్ల ప్రేమ్ కుమార్ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల సెలవులపై స్వగ్రామానికి వచ్చిన ప్రేమ్ కుమార్.. తమ అభిమాన నేత పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల ఏర్పాట్లలో పాల్గొన్నాడు. అమలాపురంలోని ఓ కాలేజీ సమీపంలో పవన్ కల్యాణ్ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ తీగ తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.