పోలవరం జిల్లా చింతూరు ఏజన్సీలో వరుసగా విద్యార్థులు మృతి చెందటం కలచివేస్తోంది. ఆదివారం కోతులగుట్ట ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి ఘటన మరువక ముందే.. తాజాగా మరో ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎటపాక మండలం గొల్లగుప్ప గిరిజన గ్రామానికి చెందిన పద్దం రోజా అనే 10 ఏళ్ల బాలిక జ్వరం, కడుపునొప్పితో బాధపడుతూ భద్రాచలం ఆసుపత్రిలో మృతి చెందింది. ఏజెన్సీలో వైద్య సేవలపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల నిర్లక్ష్యంతో పాటు వైద్య శాఖ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది.