ఔటర్ రింగ్ రోడ్డు రోటరీ టూ ఖాజాగూడ మెయిన్ రోడ్డులో యాక్సిడెంట్ జరిగింది. వేగంగా వచ్చిన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్ కారు.. రోడ్డు దాటుతున్న నందులాల్ ను ఢీకొట్టింది. రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్న నందులాల్ ను.. తన కారులో ఆస్పత్రికి తరలిస్తుండగా మరో యాక్సిడెంట్ జరిగింది. సందీప్ కారును.. మరో కారు ఢీకొట్టింది. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.