కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు రాష్ట్ర పరిపాలనకు తలమానికంగా నిలిచే సెక్రటేరియట్‌లో పని చేసే ఉద్యోగులు కదం తొక్కారు. సెక్రటేరియట్ ఉద్యోగులు తెలంగాణ సచివాలయం ప్రధాన ద్వారం ఎదుట నిరసనకు దిగారు. తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు, పీఆర్సీ, డీఏలు, ఈహెచ్ఎస్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులంతా కలిసి బాహుబలి ద్వారం ఎదుట నిరసనకు దిగారు. రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందో ఈ వీడియో మరోసారి చెప్పకనే చెబుతోంది

