టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆయన ఎడమ చేతిపై కనిపిస్తున్న కొత్త టాటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గుండ్రంగా ఉండి, మధ్య నుంచి అలల మాదిరిగా బయటకు విస్తరిస్తున్న ఈ డిజైన్‌ను చూసి.. దీని వెనుక ఉన్న అర్థం ఏమిటనే చర్చ మొదలైంది. తాజాగా కనిపిస్తున్న గుండ్రటి డిజైన్‌ను చూస్తే అది వోర్టెక్స్ లేదా రిపుల్ తరహా తరంగాల నమూనాలా కనిపిస్తోంది. దీంతో ఇది మార్పు, పరిణామం లేదా జీవితంలో ముందుకు సాగడాన్ని సూచిస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.