విజయ్ తన ఎన్నికల ఖర్చుల పరిమితిని మించారని, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఎన్నికల ప్రచార గీతం ‘తని ఒరువన్ వెడిచ్చు వరాన్’ కోసం ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌కు రూ.10 లక్షలు ముట్టచెప్పారంటూ వస్తున్న వార్తలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఎన్నికల ఖర్చుల పరిమితి రూ.40 లక్షలు దాటిపోయిందన్న వాదనల్లో కూడా ఎలాంటి నిజం లేదని విజయ్ స్పష్టం చేశారు. అలాగే, సోషల్ మీడియా ఖాతాలను విదేశాల నుంచి ఎవరైనా నిర్వహించినంత మాత్రాన విదేశీ విరాళాలు స్వీకరించినట్లు కాదని తన అఫిడవిట్‌లో తేల్చిచెప్పారు.

