దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పాత్ర అత్యంత కీలకమని, అందుకే వారిని మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మోదీ పిలుపునిచ్చారు. ‘మాదకద్రవ్యాల రహిత భారత్’ ఆశయం నెరవేరాలంటే కేవలం ప్రభుత్వాలు మాత్రమే కాకుండా ప్రజలందరూ ఏకమై శ్రమించాలని కోరారు. ముఖ్యంగా నేటి యువత, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు ఈ డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో భాగస్వాములులై చైతన్యం తేవాలని ఆయన సూచించారు. ప్రజలు స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వాలని ‘వోకల్ ఫర్ లోకల్’ నినాదాన్ని మరోసారి గుర్తుచేశారు.

