ప్రధాని నరేంద్ర మోదీ 137వ ‘మన్ కీ బాత్’ రేడియో ద్వారా దేశ ప్రజలతో పలు కీలక విషయాలను పంచుకున్నారు. దేశంలోని యువత కేవలం ఉద్యోగాల వైపే కాకుండా వినూత్నమైన సృజనాత్మక ఆలోచనలతో ముందుకు వస్తున్నారని ప్రధాని తెలిపారు. చిన్న స్థాయి ఆలోచన అయినప్పటికీ, దానికి సరైన కృషి తోడైతే అది సమాజంలో పెద్ద మార్పుకు నాంది పలుకుతుందని ఆయన పేర్కొన్నారు. టెక్నాలజీ, ఎంటర్ప్రైజెసెస్, సామాజిక సేవ వంటి రంగాల్లో యువత చూపుతున్న చొరవ అభినందనీయమని, ఇది పదిమందికి స్ఫూర్తినిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

