ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసు సిబ్బంది ఏకకాలంలో బంజారాహిల్స్‌లోని చట్నీస్, స్పైస్ 6, ఓహ్రీస్.. జూబ్లీహిల్స్‌లోని ది స్పైసీ వెన్యూ..
టోలిచౌకిలోని ఫోర్ సీజన్స్ మల్టీకుజీన్, షా గౌస్.. గచ్చిబౌలిలోని పిస్తా హౌస్ రెస్టారెంట్లలో ఆకస్మిక దాడులు చేపట్టాయి. వంటగదుల్లో పురుగుల బెడద ఉండటంతో పాటు, గడువు ముగిసిన ఆహార పదార్థాలను యథేచ్ఛగా వినియోగిస్తున్నట్లు తేలింది. ఆహారాన్ని నిల్వ చేసే విధానంలో కనీస ప్రమాణాలు పాటించకపోవడం, వంటల్లో కుళ్లిపోయిన కూరగాయలను వాడటం లాంటి తీవ్రమైన ఉల్లంఘనలను అధికారులు గమనించారు.