సంజీవని యాప్ ఓ గేమ్ ఛేంజర్ అని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా గన్నెల పంచాయతీలో సీఎం పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజనులకు అనారోగ్యం వస్తే విశాఖ, పాడేరు వెళ్లాల్సివచ్చేది. అందుకే ప్రతిఒక్క గిరిజన బిడ్డకు మెరుగైన ఆరోగ్యం ఇవ్వాలని సంకల్పించామన్నారు. మీ ఆరోగ్యం మీ ఫోన్లోనే ఉందని, ఎక్కడికెళ్లినా మీ ఆరోగ్యాన్ని ఫోన్లో చెక్ చేసుకోవచ్చని అందుకోసమే ఈ సంజీవని యాప్ ను అంబాటులోకి తెచ్చామన్నారు.