పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన అధికారులు.. వాటిలో సాధారణ చార్జీల కంటే అదనంగా వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. నిర్మల్ నుంచి ఆదిలాబాద్ సాధారణ బస్సులో టికెట్ ధర రూ.120 ఉండగా.. ప్రత్యేక బస్సులో రూ.170 వసూలు చేస్తున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. అలాగే నిర్మల్ నుంచి మంచిర్యాలకు సాధారణ చార్జీ రూ.210 ఉండగా.. ప్రత్యేక బస్సులో రూ.260 తీసుకుంటున్నారని పేర్కొంటున్నారు. పండుగ రద్దీని ఆసరాగా చేసుకుని ప్రయాణికులపై అదనపు భారం మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.