ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలో రూ.100 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న రాడిసన్ హోటల్ కు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, శాఖల మంత్రి నారా లోకేశ్ భూమిపూజ చేశారు. రవిశంకర్ గ్రూప్, రవిప్రియ హాస్పిటాలిటీస్ ఎల్ఎల్పీ సంయుక్త భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ హోటల్ ను నిర్మించనున్నారు. ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటుకానున్న తొలి 5 స్టార్ హోటల్ గా ఇది నిలవనుంది.