ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వ సిద్దమవుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లోని 123 మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లలో మౌలిక వసతుల కల్పన కోసం ₹7,469.46 కోట్ల భారీ ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా విడుదల చేసింది. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో రూ.4,655.82 కోట్లతో డ్రైనేజీ వ్యవస్థతో కూడిన రోడ్ల నిర్మాణం చేపట్టబోతున్నారు. అలాగే రూ.509.12 కోట్లతో 541 కొత్త పార్కుల అభివృద్ధి, పచ్చదనానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.