భారత యువ గ్రాండ్ మాస్టర్ రమేష్‌బాబు ప్రజ్ఞానంద అంతర్జాతీయ చెస్ రంగంలో సరికొత్త చరిత్ర లిఖించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ చెస్ టూర్ (GCT) ఫైనల్స్‌లో అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచి, ఈ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. తుది సమరంలో అమెరికాకు చెందిన దిగ్గజ ఆటగాడు ఫ్యాబియానో కరువానాపై 15-13 తేడాతో ప్రజ్ఞానంద సంచలన విజయం సాధించారు. విజయంతో వచ్చే ఏడాది జరగబోయే గ్రాండ్ చెస్ టూర్ పోటీలకు నేరుగా అర్హత (బెర్త్) సాధించారు.