జూనియర్ డాక్టర్ల (జూడా) డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం, జూడా ప్రతినిధుల మధ్య తొలి విడత చర్చలు జరిగాయి. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో గురువారం మంగళగిరిలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండ్యన్ అధ్యక్షతన సుమారు రెండు గంటలపాటు చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం ఎదుట జూడాలు ఆరు డిమాండ్లు ఉంచారు. వీటిలో ఐదు అంశాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే స్టైపెండ్ పెంపు అంశంపై మరోసారి చర్చలు జరుపుతామని జూడాల ప్రతినిధులకు ప్రభుత్వం హామీ ఇచ్చింది.

