చైనా ఇటీవల వరుసగా ఆధునిక ఆయుధాల్ని పరీక్షిస్తోంది. తాజాగా స్టీల్త్ యాంటీ షిప్ క్రూయిజ్ మిస్సైల్‌ను పరీక్షించింది. ఇది బ్లాక్, రాడార్ అబ్సార్బింగ్ కోటింగ్ డిజైన్‌తో తయారైన క్షిపణి.అంటే, నల్లటి రంగుతో రాడార్లకు చిక్కకుండా,రహస్యంగా దూసుకెళ్లే క్షిపణి. ఈ తరహా క్షిపణులు రాడార్లకు చిక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.సముద్రంలోని చైనా యుద్ధ నౌక నుంచి వర్టికల్ లాంఛ్ ప్యాడ్ ద్వారా ఈ క్షిపణిని పరీక్షించారు. ఇది అత్యాధునిక, నౌకా విధ్వంసక క్షిపణిగా నిపుణులు చెబుతున్నారు.