ఆస్ట్రేలియా స్పీడ్ బౌలర్ మిచెల్ స్టార్క్.. టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంక్‌లో నిలిచాడు. భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా స్థానాన్ని అతను ఆక్రమించేశాడు. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్లోచెలరేగిన స్టార్క్.. తన కెరీర్లో తొలిసారి నెంబర్ వన్ బౌలర్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.బంగ్లాదేశ్‌తో మాకాలో జరిగిన మ్యాచ్‌లో స్టార్క్ పది వికెట్లు తీసి ర్యాంకుల్లో దూసుకెళ్లాడు.బుమ్రా 2024 ఫిబ్రవరి నుంచి టెస్టు బౌలర్ ర్యాంకుల్లో మొదటి స్థానంలోనే ఉన్నాడు.