రష్యాలోని ఫార్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్న నిర్మాణాత్మక ‘అమూర్ గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్ వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ విషాదకర దుర్ఘటనలో ఆరుగురు చైనా పౌరులతో పాటు ఒక రష్యన్ పౌరుడు కలిపి మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా,మరో తొమ్మిది మంది చైనా కార్మికుల ఆచూకీ గల్లంతు కాగా, వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.ప్రమాదం ధాటికి సుమారు 152 మంది గాయపడగా వీరిలో 36 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చేర్పించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.