తిరుపతిలో నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన కలకలం రేపింది. నగరంలోని ఆర్సీ రోడ్డులో కలశం బిల్డింగ్ సమీపంలోని గ్యాస్ గోడౌన్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నూతన భవనం నిర్మాణం కోసం గుంతలు తీస్తున్న సమయంలో పక్కనే ఉన్న నాలుగు అంతస్తుల భవనం కూలిపోయినట్లు సమాచారం. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. భవనం కూలిన సమయంలో లోపల ఎవరైనా ఉన్నారా అనే అనుమానంతో అధికారులు అప్రమత్తమయ్యారు