ఆన్‌లైన్‌లో విషపూరితమైన ధతూరా (ఉమ్మెత్త) పండ్లు, విత్తనాలను మానవ వినియోగానికి విక్రయించిన వ్యవహారంలో కర్ణాటక ఆహార భద్రత, ఔషధాల పరిపాలన విభాగం (FDA) అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్‌లకు జారీ చేసిన ఫుడ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్లను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సస్పెండ్ చేసింది. ఈ ప్లాట్‌ఫామ్‌లలో ధతూరా పండ్లు, విత్తనాలను ఆహారంగా విక్రయిస్తున్నట్లు విభాగం నిర్వహించిన విచారణలో తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఉమ్మెత్త పండ్లు, విత్తనాలను మానవ వినియోగానికి అందిస్తున్న అన్ని ఆన్‌లైన్ లిస్టింగ్‌లు, ప్రకటనలను వెంటనే తొలగించాలని FDA ఆదేశించింది.