గుజరాత్ మోదీ చేతిలో కట్టు బానిసలుగా ఉండాలనుకుంటున్నారా, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారా అని రాష్ట్ర బీజేపీ నేతలను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ నాయకుల మెతకవైఖరి వల్ల గుజరాత్ వాళ్లు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. తమకు పెట్టుబడులు రావేమోనని.. గుజరాత్ కు చెందిన నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం పర్యటనకు అనుమతించలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని విదేశాల్లో అడ్డుకోవడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఇది నాకు కాదు తెలంగాణకు జరిగిన అన్యాయం అన్నారు.