సంచలనంగా మారిన 22ఏ నిషేధిత భూముల వ్యవహారంపై గత కొన్ని రోజులుగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ భూములు, నిషేధిత భూములు కాకున్నా ఈ జాబితాలో ఉండి, స్లాట్ బుక్ చేసుకున్న భూముల సమస్యను 24 గంటల నుంచి 36 గంటల్లో పరిష్కరిస్తామన్నారు. గతంలో 22ఏ కింద గతంలో రిలాక్సేషన్ ఇచ్చిన భూములు మళ్లీ ఆ జాబితాలో వచ్చినా పరిష్కరిస్తాం. గతంలో స్లాట్స్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోని వారికి ఆ ఛార్జీలను తిరిగి చెల్లిస్తాం.