ఆరు నెలల క్రితం ప్రియుడి మోజులో పడి కన్న తల్లిదండ్రులకు మత్తు మందు ఇచ్చి హత్య చేసిన నర్సు సురేఖ ఇప్పుడు మత్తు మందు తీసుకుని ఆత్మహత్య చేసుకుంది.తల్లిదండ్రుల హత్యకేసులో జైలు శిక్ష అనుభవించి ఈ మధ్యనే బెయిల్ సురేఖ బయటకు వచ్చింది. బెయిల్ వచ్చినప్పటి నుంచి సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్టల్ లో సురేఖ ఉంటున్నారు. అదే హాస్టల్ లో మత్తు ఇంజక్షన్ వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.