మహారాష్ట్ర అమరావతి జిల్లా మహిళా ఆసుపత్రిలో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. NICUలో మంటలు చెలరేగడంతో ముగ్గురు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో 39 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. తెల్లవారుజామున సుమారు 3.30 గంటల సమయంలో NICUలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటిలేటర్‌కు సంబంధించిన సాంకేతిక లోపం, అనుకోని పేలుడు లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.