మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేను కలవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆదివారం మధ్యాహ్నం బెంగళూరులో ఖర్గేతో సురేఖ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఖర్గేకు వివరించినట్లు తెలుస్తోంది.