ఇప్పటి వరకూ ఆన్లైన్ వీడియో వరల్డ్‌ను ఏకచ్ఛత్రాధిపత్యంతో ఏలిన యూట్యూబ్ సింహాసనాన్ని కదిలించడానికి ఒక కొత్త ప్లేయర్ గ్లోబల్ రేసులోకి దిగాడు. ఇన్నాళ్లూ కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్‌ను మించిన గతి లేదనుకుంటున్న సమయంలో, చైనాకు చెందిన బిలిబిలి అనే యాప్ అంతర్జాతీయ మార్కెట్లో జెండా పాతడానికి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేసింది. నెలకు సుమారు 37 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లతో ఊపుమీదున్న ఈ యాప్, ఇటీవల ఇంటర్నేషనల్ వెర్షన్‌ను కూడా మార్కెట్లోకి వదిలింది.