గచ్చిబౌలి పరిధిలోని అంజయ్యనగర్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. శనివారం కూలిన భవనం పక్కనే పాక్షికంగా దెబ్బతిన్న మరో అక్రమ నిర్మాణం ఉండగా.. బాహుబలి క్రేన్ సహాయంతో దాన్ని కూల్చివేస్తున్నారు. అక్రమంగా నిర్మించిన ఇలాంటి భవనాలను మున్సిపల్, హైడ్రా అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రమాదం అంచున ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తున్నామని చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.