తెలంగాణలో ఆటోలు, క్యాబ్‌లు, యాప్ ఆధారిత వాహనాలు, స్కూల్ వ్యాన్ల సేవలు నేటి అర్దరాత్రి నుండి నిరవధికంగా నిలిచిపోనున్నాయి. ఆటో, క్యాబ్, ప్రైవేట్ రవాణా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఆదివారం అర్ధరాత్రి నుంచి బంద్ పాటించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో సోమవారం నుంచి రోజువారీ ప్రయాణికులు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రైవేట్ రవాణా కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు, ప్రతి సంవత్సరం రూ.12 వేల ఆర్థిక సాయం,వీరి డిమాండ్లలో కొన్ని.