గచ్చిబౌలిలో భవన ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో, హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెంటనే స్పందించి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిబంధనలను తుంగలో తొక్కి నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను ఎలాంటి వెనుకంజ లేకుండా నేలమట్టం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కేవలం యాభై గజాల స్థలంలో ఏడంతస్తుల నిర్మాణం చేపట్టడమే ఈ పెను ప్రమాదం ముంచుకొచ్చిందని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ దుర్ఘటనకు కారణమైన బిల్డర్ సాజిద్ చేపట్టిన నిర్మాణాలన్నీ అత్యంత నాసిరకరంగా ఉంటాయని స్థానిక నివాసితులు ఆరోపిస్తున్నట్లు కమిషనర్ వెల్లడించారు.